ఎమ్మెల్యేను కలిసిన ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ హరికృష్ణ మాట్లాడుతూ
చేనేత కార్మికులకు అండగా బీఆర్‌ఎస్ సర్కారు నిలిచిందన్నారు.రసాయనాలు, నూలుపై 40శాతం రాయితీతో నేడు నేతన్న కుటుంబాల్లో వెలుగులు నింపిందన్నారు.
రైతు బీమా మాదిరి నేతన్న బీమా పథకం,చేనేత మిత్ర పథకం ఇస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు
కొంతమందికి నూలుపై 40 శాతం రాయితీ రావడంలేదని వారికి వచ్చే విధంగా చూడాలని ఎమ్మెల్యేను కోరారు.
ఈ సందర్భంగా వార్డు మెంబర్లు మాట్లాడుతూ రైతు రుణమాఫీ, వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు పంట నష్టం డబ్బులు రైతులందరికీ చేరే విధంగా చూడాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కోరారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ కొండా హరికృష్ణ వార్డు మెంబర్లు వేముల రాములు, కామిడీ శ్రీనివాస్ రెడ్డి, కక్కర్ల రాజు ,కరుణాకర్ రెడ్డి కుమార్ ,జంధ్యాల ఉపేందర్, గొల్లపల్లి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు