*పేద ప్రజల సంక్షేమానికి పాటుపడే బిఆర్ఎస్ పార్టీని ఆదరించండి
*మొగిలిగిద్ద ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విజ్ఞప్తి*
*కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే అభివృద్ధి అధోగతి అవుతుందని ఆరోపణలు*
*కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధిని కొనసాగించాలని పిలుపు
*షాద్ నగర్ : ప్రజా గొంతుక ప్రతినిధి)*
ప్రజల యొక్క సంక్షేమం వారి ఆర్థిక అభ్యున్నతికి ప్రతినిత్యం పాటుపడే విఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఈ మేరకు
మొగిలిగిద్ద గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధిని కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. రూ. 2.99 కోట్లతో సిసి రోడ్డు నిర్మాణం పనులు, అంతర్గత మురుగు కాలువలు చేపట్టడం జరిగిందని, ఆసరా పింఛన్ ధ్వారా 608 మందికి ప్రతి నెల 13.94 లక్షల రూపాయల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రైతు బంధు లబ్ధిదారులు 1124 మంది, 10.24 కోట్లు, రైతు రుణమాఫీ లబ్ధిదారులు 592 మంది, 3.89 కోట్లు మంజూరు కావడం జరిగిందని అన్నారు.
రైతు భీమా లబ్ధిదారులు 13 మంది, 65 లక్షలు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 245 మందికి 2.45కోట్లు అని, శ్మశానవాటిక నిర్మాణము కోసం 12.60 లక్షలు వెచ్చించడం జరిగిందని అన్నారు. మొగిలిగిద్ద నుండి ఎల్లంపల్లి వరకూ 20 లక్షలు,
మొగిలిగిద్ద నుండి చించొడ్ వయా కందివనం వరకూ 75లక్షలు, మొగిలిగిద్ద నుండి దొంతికుంట తండా 2.2కొట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. 2.93 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 4 ట్యాంకుల నిర్మాణంతో 1622 ఇండ్లకు త్రాగునీటి సరఫరా, మిషన్ కాకతీయ ద్వారా 24.53 లక్షలతో గంపచెరువు, 17 లక్షలతో కానుగులకుంట చెరువు, 20లక్షల తో గిద్ద కుంట చెరువు పూడికతీత పనులు చేసామని గుర్తు చేశారు.
*రంగధాములముల దేవాలయ అభివృదికి 50లక్షలు*
అంతేకాకుండా నియోజకవర్గంలో డ్వాక్ర భవనంకు 15 లక్షలు, రజక భవనం 17 లక్షలు, గౌడ భవనం 20 లక్షలు, మున్నూరు కాపు భవనం 20లక్షలు,
అంబేద్కర్ భవనం 25 లక్షలు, మైనారిటీ కమ్యూనిటీ హాల్ 15 లక్షలు కేటాయించడం జరిగిందని వెల్లడించారు. అలాగే కుమ్మరి భవనం 20 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హల్ 20 లక్షలు, ముదిరాజ్ భవనం 30 లక్షలు, గౌడ కమ్యూనిటీ హాల్ 20 లక్షలతో పనులు ప్రారంభించామని తెలిపారు.
6.73కోట్లతో గురుకుల బాలికల పాఠశాల ఏర్పాటు, కస్తూర్భా బాలికల పాఠశాల ఏర్పాటు చేసామని ఎంతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, తమ పార్టీని, తనను ప్రజలు ఆదరించాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వినమ్రంగ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలని, అభివృద్ధిని కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కోరారు.