బిడ్డ తీసుకో నా కానుక పింఛన్ డబ్బులు
చిరునవ్వుతో కానుకను స్వీకరించిన పల్లా
నువ్వు గెలవాలి చరిత్ర సృష్టించాలి
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారంలో భాగంగా జరుగుతున్న ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో ఖుర్షీద్ జానీ
వృద్ధురాలు తనకు వస్తున్న కెసిఆర్ పింఛన్ డబ్బులు ఒక నెల 2016 రూపాయలను ప్లేట్లో పెట్టి ఎలక్షన్ ఖర్చుల నిమిత్తం పల్ల రాజేశ్వర్ రెడ్డికి తన వంతు కానుకగా అందించింది. చిరునవ్వుతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ కానుక ని స్వీకరించి
అమ్మ గెలిచి వస్తా గెలిచినంక పింఛన్ డబుల్ అవుతుంది. కెసిఆర్ సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నో ప్రజలకు నేరుగా అందుతాయని తెలిపి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి ,మండల అధ్యక్షులు చంద్రారెడ్డి ,కోఆర్డినేటర్ ఫిరోజ్ , నర్సింలు తదితరులు ఉన్నారు