దుర్గామాతలను దర్శించుకున్న తాటి
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ప్రతినిధి
అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రలో శివాలయం మరియు అంకమ్మ ఆలయం సన్నిధిలో ఎర్పాటు చేసిన దుర్గామాతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అనంతరం కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసి దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజల పై ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బానోత్ భీముడు నాయక్, చెరుకూరి రవి, ముద్రగడ వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ తాటి రామచంద్రరావు, అజీమ్, బూరుగుపల్లి కృష్ణారావు,పెద్దాపురం నాగరాజు,చల్లా రమేష్,ఇనపనూరి రాంబాబు,లాలయ్య, చిన్ని,చల్లా పెద్ద లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.