పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు 1,01,116/- రూపాయలు విరాళం
టిడిపి జాతీయ కార్యదర్శి కాసాని విరేష్ బాబు
కుల్కచర్ల, ప్రజా గొంతుక న్యూస్ :
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో
ఈనెల 11వ తేదీన బహుజనుల చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాటుకు టిడిపి జాతీయ కార్యదర్శి కాసాని విరేష్ ముదిరాజ్ ఒక లక్ష ఒక వెయ్యి 116 రూపాయలు 1,01,116/- రూపాయలు విరాళం అందించారు
.తాను అందుబాటులో లేని కారణంగా టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు చంద్రహస్ మరియు స్థానిక జిల్లా నాయకులు బాలముకుందం ఆధ్వర్యంలో ఒక లక్ష ఒక వెయ్యి 116 రూపాయలు 1,01,116/- రూపాయలు విరాళం కుల్కచర్ల మండల గౌడ సంఘానికి అందించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మాణిక్యం విజయభాస్కర్,జోగు వెంకటయ్య, కాంగారి ఆంజనేయులు, బొక్క వెంకటయ్య,విజయ్,కొండయ్య, తదితరులు ఉన్నారు.