గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
మనోహరాబాద్ అక్టోబర్07(ప్రజా గొంతుక)
గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమనీ,సీఎం కెసిఆర్ తీసుకుంటున్న చర్యలతో గ్రామాల రూపురేఖలు మారాయని జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్,ఫారెస్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు అన్నారు.మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ అగ్రహరం గ్రామంలో స్థానిక సర్పంచ్ రేణుక ఆంజనేయులు అద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా 30 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం,24 లక్షలతో నిర్మించిన మహిళా భవనం,15లక్షలతో నిర్మించిన అంగన్వాడి భవనం,24 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ లను వారు శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు గత పాలకులకు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టినా పట్టించుకున్న పాపాన పోలేదని,స్వయం పాలనలో అడగకున్న సీఎం కేసీఆర్ అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని,మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని గుర్తు చేశారు.గతంలో ఎండాకాలం వస్తే బీళ్ళు పడ్డ చెరువులు కనిపించేవని కానీ సీఎం కేసీఆర్ పాలనలో కాలేశ్వరం జలాలు తీసుకువచ్చి మండుటెండలో సైతం మత్తడి దూకిస్తున్నామన్నారు.దీంతో గ్రామాల్లో త్రాగు,సాగునీరుకు ఇబ్బంది లేకుండా పోయిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల పోరం కన్వీనర్ చిట్కుల మహిపాల్ రెడ్డి,ఉమ్మడి మండల ప్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి,ఉప సర్పంచ్ ఆంజనేయులు,ఎంపీడీఓ యాదగిరి రెడ్డి,మిషన్ భగీరథ డెప్యూటీ ఇఈ శ్రీనివాస్, సిడిపివో హేమ భార్గవి,వివిధ గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు,నాయకులు,అధికారులు,గ్రామస్తులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.