మావోల ఆచూకీ తెలపండి. తగిన పారితోషకం పొందండి

మావోల ఆచూకీ తెలపండి. తగిన పారితోషకం పొందండి
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
అభివృద్ధికి అడ్డుపడుతున్న నిషేధిత మావోయిస్టుల ఆచూకీ తెలిపి తగిన పారితోషకం అందుకోవాలని చర్ల సిఐ బి రాజగోపాల్ ప్రజలను కోరారు.
ఈ మేరకు శనివారం ఆయన నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన నాయకుల ఫోటోలు, వారిపై ఉన్న రివార్డులతో కూడిన వాల్ పోస్టర్లను పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ నాయకులు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా మారి,ఆదివాసీలను బెదిరిస్తూ బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకుంటున్నారని
, మైనర్లను సైతం విద్య వైపు మొగ్గు చూపకుండా తమ పార్టీలో చేరాలంటూ అనేక చిత్రహింసలకు చేస్తున్నారని గురి ఆయన తెలిపారు.మారుమూల ఏజెన్సీ అటవీ ప్రాంత గ్రామాలలోని ఆదివాసీలకు రహదారి సౌకర్యాలు, విద్య, వైద్యం, విద్యుత్తు లాంటి మౌలిక సదుపాయాలు అందకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు.
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, గజేందర్ అలియాస్ మధు,పొట్టం సంకి అలియాస్ అరుణ, కురసం మంగు అలియాస్ బద్రు, కుంజా వీరన్న అలియాస్ లచ్చన్న,మంగు, దీపక్నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకుల వాల్ పోస్టర్లను సీఐ రాజగోపాల్ విడుదల చేశారు.