ఉత్తమ పోలీస్ స్టేషన్ గా వెంకటాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్ ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ పీఎస్ గా ఎంపికైంది. పరిశుభ్రమైన పోలీస్ స్టేషన్, మహిళలకు సంబంధిత కేసుల పరిష్కారాలు, ఆస్తి, క్రైమ్, మిస్సింగ్, పలుకేసుల పరిష్కారంలో రాష్ట్రంలో 8వ ర్యాంక్ సాధించింది. ప్రస్తుత సీఐ బండారు.కుమార్, ఎస్పై అశోక్ సేవలను రాష్ట్రస్థాయి పోలీసులు గుర్తించి ప్రతిభ కనబర్చిన పోలీస్ స్టేషన్ గా గుర్తించారు.