కార్యకర్త కుటుంబానికి ఆపద అంటే చలించిన ఎమ్మెల్సీ హృదయం
—వెంటనే ఆర్థిక సహాయం
ప్రజా గొంతుక/ జనగామ నియోజకవర్గం
జనగామ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించారు.
జనగామనియోజకవర్గం,బచ్చన్నపేట మండలం,లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పిడుగు కనకయ్య కూతురు కు అకస్మాత్తుగా అపెండెక్స్ రావడంతో చేర్యాల లో ఉన్న ఓ ప్రయివేట్ ఆసుపత్రి లో చేర్పించారు.
కానీ వారి దగ్గరడబ్బులులేకఇబ్బందులు,ఎదుర్కొంటున్నారని,
కేశిరెడ్డిపల్లి సర్పంచ్ దివ్యఅరవింద్ రెడ్డి, తమ్మడపల్లి సర్పంచ్ మేకల కవిత రాజు.కొన్నే సర్పంచ్ వేముల వెంకట్ గౌడ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన
వెంటనే చలించిన ఎమ్మెల్సీ డిశ్చార్జ్ కి కావాల్సిన 40000 రూపాయలను చేర్యాల కౌన్సిలర్ మంగోలు చంటి ద్వారా పంపించి ఆసుపత్రిలో ఆ కార్యకర్త కుటుంబానికి అందించారు.
ఇలాంటి దయ కలిగిన ఎమ్మెల్సీకి ఎప్పుడు రుణపడి ఉంటామని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు.