*విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుని అనుగ్రహం అందరిపై ఉండాలి
*ఎనిమిదో వార్డు కౌన్సిలర్ తోకల విజయలక్ష్మి
*పోచమ్మ బస్తీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుని మంటపం వద్ద ప్రత్యేక పూజలు చేసిన కౌన్సిలర్
*శంషాబాద్ :ప్రజా గొంతుక ప్రతినిధి*
విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుని అనుగ్రహం ప్రజలందరిపై యుండాలని కౌన్సిలర్ తోకల విజయలక్ష్మి అన్నారు. సోమవారం శంషాబాద్ మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డులో పోచమ్మ బస్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో
శంషాబాద్ మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ తోకల విజయలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో తోకల వేణు,శీలం. వివేకానంద, శీలం.విక్కీ, కాల్య. సందీప్, తుమ్మల.శివారెడ్డి, తోకల సాయికిరణ్, బస్తీ పెద్దలు యువకులు తదితరులు పాల్గొని విఘ్నేశ్వరుని దర్శనము చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగినది.