బాధితకుటుంబాలకుఆర్థికసహాయంఅందజేసిన గద్వాలసోషల్,రెస్పాన్స్, బిలిటి టీం సభ్యులు..
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లా గద్వాలనియోజకవర్గంలోని కాలూర్ తిమ్మం దొడ్డి మండల పరిధిలోని నందిన్నె గ్రామానికి చెందిన,నరసింహులు (50) గద్వాల్ నందు రాజీవ్ మార్గ్ లో చిన్న (చాయ్ హోటల్) నడుపుతూ ఉన్న క్రమం లో ఆక్సిడెంట్ జరిగి కుడి కాలు విరిగిపోవడం జరిగింది. దీంతో గత (5) నెలలుగా ఇంటికే పరిమితం ఈ పరిస్థితి లోమాసోషల్,రెస్పాన్సిబిలిటీటీమ్,నుసంప్రదించినిత్యావసరంసరుకుల కై రిక్వెస్ట్ చేయడం తో గద్వాలలో వారి ఇంటికి వెల్లి పరామర్శించి, రూ 5000/-రూపాయల విలువగల నిత్యవసర సదుకులు మరియు రూ7000/-రూపాయల నగదును సోషల్ రెస్పాన్స్బిలిటీ వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
అలాగే నల్లకుంట గద్వాలలో నివాసం ఉంటున్న బషీరాబి (45) ఒక నెల క్రితం తనభర్త ఆక్సిడెంట్ లో చనిపోయారు. దీంతో ఆమె కొన్ని ఇండ్లలో పనిచేసి కుటుంబాన్ని నడుపుతున్న క్రమంలో ఆమెకు కూడా (2) నెలలక్రితం ఆక్సిడెంట్ జరిగిన నేపథ్యంలో దీంతో ఆమెఇంటికే పరిమితమై,నిత్యావసర సరుకులకు మా సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ కు రిక్వెస్ట్ చేసింది. దీంతో వారు గద్వాలలో ఆమె ఇంటికివెల్లిపరామర్శించి రూ5000/-రూపాయల విలువగల నిత్యవసర సరుకులు మరియు రూ7000/-రూపాయల నగదునుసోషల్,రెస్పాన్స్ బిలిటి వారి చేతుల మీదుగాఅందజేయశ్తడం జరిగింది.అలాగే గద్వాల దరూర్ మెట్టు నందు నివాసం ఉంటూ పనికి వెళ్తున్న సందర్భంలో ఉమర్ (30) ఆక్సిడెంట్ తో కాళ్ళు పనిచేయడం లేదు. ఇతనుకు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కువిపత్కరపరిస్థితిలో ఉన్నందున ఈయన కుటుంబం కూడా నిత్యావసర సరుకులకై మాసోషల్,రెస్పాన్సిబిలిటీ టీమ్ కు రిక్వెస్ట్ చేయగా గద్వాల లో వారి ఇంటికి వెల్లి పరామర్శించిరూ5000/-రూపాయల విలువగల నిత్యవసర సరుకులు మరియురూ7000/-రూపాయలనగదును సోషల్ రెస్పాన్స్బిలిటీ టీం సభ్యుల చేతుల మీదుగాఅందజేయడం జరిగింది. తమ మూడు ప్రోగ్రాములు చేసి మూడు కుటుంబాలకు కలిపి రూ 15000 వేల రూపాయల సరుకులు రూ 21000 నగదును సోషల్ రెస్పాన్స్ బిలిటి టీం సభ్యుల చేతుల మీదుగాపంపిణీచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శివ, రామన్న, సంజీవ్, మురళి, నాగరాజు, మోహన్, భాస్కర్, వెంకట్రాముడు, వినోదు, అశోకు,తదితరులుపాల్గొన్నారు.