అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
-చింతలపల్లి, తిమ్మాపురం,నర్సనగర్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.
ప్రజాగొంతుక// వరంగల్ జిల్లా//సంగెం ప్రతినిధి:
సంగెం మండలంలొని చింతలపల్లి,తిమ్మాపురం, నర్సనగర్ గ్రామలలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, మార్చి నెలలో పంట నష్టపోయిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
పర్యటించిన ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా చింతలపల్లి గ్రామంలో రూ.30లక్షలతో నూతనంగా వేసిన సీసీ రోడ్లు,రూ.10 లక్షలతో నిర్మించిన స్మశానవాటిక,పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించారు. గ్రామంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 497 మంది రైతులకు గాను 45లక్షల 27వేల రూపాయల విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం నర్సానగర్ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రూ.20 లక్షలతో నూతనంగా వేసిన సిసి రోడ్లు 12.60 లక్షలతో నిర్మించిన స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనము,డంపింగ్ యార్డ్ ప్రారంభించి, చెక్కుల పంపిణీ చేసి,అనంతరం తిమ్మాపురం గ్రామంలో పర్యటించి నూతనంగా వేసిన సిసి రోడ్లు, గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవం చేసి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు చెక్కులు పంపిణీ చేసి కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, సొసైటీ, మార్కెట్, చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతుబందు కన్వీనర్లు,సభ్యులు, రైతులు, వివిధ గ్రామాల సర్పంచులు వార్డ్ మెంబర్లు ప్రజలు, మహిళలు, బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.