కార్యకర్త దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్సీ
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, మన్సాన్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కోటూరు ప్రభాకర్ బిఆర్ఎస్ కార్యకర్త మృతి చెందడం జరిగింది .
విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అతని దహన సంస్కారాల కు 25వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
కార్యకర్త కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లతాశ్రీ తిరుపతి గౌడ్ సర్పంచ్ పంజాల తార శ్రీధర్ గౌడ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గీసా ప్రకాష్ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మైసయ్య రాజు యాదగిరి సందీప్ శ్రీనివాస్ కనకయ్య బాలమల్లు జి కోర్ సత్యనారాయణ వెంకటేష్ టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు