అంగన్వాడీ టీచర్స్, మరియు హెల్పర్స్ ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ప్రజా గొంతుక/ కేసముద్రం/ సెప్టెంబర్/15
శుక్రవారం రోజున కేసముద్రం మండల కేంద్రంలోని తాసిల్దార్ ఆఫీస్ ముందు అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ (సిఐటియు) అనుబంధం .రాష్ట్ర,వ్యాప్త సమ్మెలో భాగంగా తాసిల్దార్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేసినారు.
ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జల్లే, జయరాజు అంగన్వాడీ టీచర్ సీనియర్ నాయకురాలు ప్రేమలత మాట్లాడుతూ గ్రామాలలోని గర్భిణీ స్త్రీలకు ,బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వం ఇచ్చిన పనులు చేసుకుంటూ గ్రామాలలోని పేద నిరుపేద మహిళలందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్స్ ,అండ్ హెల్పర్స్ చాలీచాలని వేతనాలతో జీవనాన్ని సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముందు భాగాన నిలిచి పోరాటాలు నిర్వహించిన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ను బిఆర్ఎస్ ,ప్రభుత్వం పట్టించుకోకపోవడం, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం లో విఫలమైందని అన్నారు. తెలంగాణ వచ్చినంక మా బతుకులు బాగుపడతాయని ఆశించిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కు నిరాశ ఎదురయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యున్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా కూడా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వా లు వాటిని అమలు చేయడంలో విఫలమైనవని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ టీచర్స్, అండ్ హెల్పర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని ,కనీస వేతనం నెలకు రూ. 26,000 ఇవ్వాలి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని , రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 10 లక్షలు , హెల్పర్లకు,ఐదు లక్షలు చెల్లించాలని,
వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని , పది లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని టైపిస్ట్, స్వరూప కు ఇవ్వడం అయినది. ఈ కార్యక్రమంలో మంగమ్మ నిర్మల లత నాగేంద్ర జ్యోతి పాల్గొన్నారు.