వలస ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి…
ప్రజా గొంతుక ప్రతినిధి/అశ్వరావుపేట నియోజకవర్గం,
ములకలపల్లి మండలంలో వలస ఆదివాసీలకు సంబంధించిన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అలాగే వారికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్ హోదాను వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని
ఆదివాసి సేన రాష్ట్ర సహాయ కార్యదర్శి అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసి ఎమ్మెల్యే అభ్యర్థి ఊకె రవి డిమాండ్ చేశారు. ములకలపల్లి మండలం మామిళ్ళగూడెం వలస ఆదివాసి గ్రామం లో ప్రచారం లో
భాగంగా పర్యటించిన వారు మాట్లాడుతూ ఇటీవల చతిస్గడ్ నుంచి వలస వచ్చినటువంటి ఆదివాసీలు వారికి సంబంధించినటువంటి హక్కులను కోల్పోతున్నారని వారి జీవన విధానం మా జీవన విధానం వారి సంస్కృతి సాంప్రదాయాలు నా సంస్కృతి సాంప్రదాయాలు,ఇలవేల్పులు, కట్టుబాట్లు,ఇంటిపేర్లు అన్నీ కూడా ఒకటేనని
కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క స్వలాభం కోసం మురియా కోండ్,గుత్తి కోయ తదితర విధాలుగా మారుస్తూ వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను రాజ్యాంగాన్ని చట్టాలను అవమానపరుస్తున్నారని,
గోత్తి కోయ అనేది గెజిట్లోనే లేదని, దేశవ్యాప్తంగా ఆదివాసీల యొక్క విధానం ఒకటే అని బ్రిటిష్ చట్టాలు వచ్చినప్పటి నుంచి చెప్తున్న కూడా భారత ప్రభుత్వం రకరకాల పద్ధతిలో మార్చటం అనేది సరైన పద్ధతి కాదని
కోయలు,గుత్తి కోయలు వేరువేరు కాదు ఒకే గట్టు గోత్రం ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు.గట్టు గోత్రాలు కూడా సమానమే వారి డిఎన్ఎ కూడా ఒకటే చట్టబద్ధతలేని వాళ్లను షెడ్యూల్ జాబితాలో చేరుస్తూ షెడ్యూలు
జాబితాకి చెందినటువంటి మూలవాసులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటూ వారికి ఎటువంటి హక్కులు కల్పించకపోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం.నేడు వారు విద్యా,వైద్యం తదితర వాటికి దూరంగా ఉంటున్నారని ఇంకా వారు వెనకబడి పోతున్నారని వారి సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
తగదని,ఆదివాసీల0దరికి కూడా దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని ఒక ట్రైబల్ పాలసీని భారత్ ప్రభుత్వం ప్రకటించాలని వారు కోరారు. షెడ్యూల్ ప్రాంతాలు ఆదివాసీల కోసం మాత్రమే ప్రకటించారని ప్రస్తుతం కొత్త కులాలను కలిపితే వారికి అవి వర్తించవని భారత ప్రభుత్వం భారత రాజ్యాంగం అయ్యేనాటికి ఏవైతే తెగలు ఉన్నాయో వారికి మాత్రమే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఒకే హోదా కల్పించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాల అన్నదమ్ముల కలిసి
ఉంటున్నటువంటి వారు రిజర్వేషన్ పేరుతో ఆదివాసిలను వేరు చేస్తున్నారని, వేరుచేసి ఆదివాసీలను ప్రభుత్వాలు చిన్నవిన్నం చేస్తున్నాయని ఆదివాసి ప్రాంతాలలో ఉంటున్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి పెద్ద కుట్ర జరుగుతుందని
దీనిని ఆదివాసి సమాజం గ్రహించాలని వారు కోరారు. వారి హక్కులకు వారి భూములకు కూడా రక్షణ నిమిత్తం రాజ్యాంగాన్ని అనుసరించి రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కార్మిక సేన నాయకులు వాడే యాలాద్రి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.