రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహ విద్యార్థుల సమస్యలను, పరిష్కరించాలి
ప్రజా గొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు అనగా అక్టోబర్ 9న నాగార్జునసాగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో హలియ ప్రాంతంలో శాసనసభ్యులు నోముల భగత్ క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నల్లబెల్లి జగదీష్, కోరే రమేష్ మాట్లాడుతూ* అనేక విద్యారంగ సమస్యలతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది కనీసం కస్తూర్బా కి గురుకులాలకి సొంత భవనాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారు అదేవిధంగా హాస్టలల్లో 33.66 పైసల నాణ్యమైన భోజనం అందించడం ఎలా సాధ్యమవుతుంది పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలి, 5177 కోట్ల పెండింగ్ లో స్కాలర్షిప్ మరియు ఫీజ్ రియాంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి. ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ల మెస్ ఛార్జీలు పెంచుతున్నామని చెప్పేసి హామీ ఇచ్చి దానిని అమలు చేయడంలో విఫలమైంది , మహిళా కళాశాల విద్యార్థులకు మెడికల్ కిట్లు అందించాలి అనేక విద్యారంగ సమస్యల మీద ర్యాలీ రూపంలో సుమారు 70 మంది కళాశాల విద్యార్థులతో క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళుతుంటే మార్గం మధ్యలోనే పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించడం జరిగింది అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద సవితి తల్లి ప్రేమ చూపకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆందోళన చేపడుతామని నిన్ను గద్దె ఎక్కించింది విద్యార్థుల్లోకమే నిన్ను గద్దె దించేది కూడా విద్యార్థులే అని హెచ్చరిస్తున్నం ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు ఆలేటి చందు నవీన్ గోపి సాయి తదితరులు పాల్గొన్నారు.