*కదం తొక్కుతు కదిలిన కాంగ్రెస్ శ్రేణులు*
*రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే*
*మండల అధ్యక్షులు బి ఎస్. ఆంజనేయులు*
కుల్కచర్ల,ప్రజా గొంతుక న్యూస్ : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని వివిధ గ్రామాల నుంచి తుక్కుగూడ విజయబేరి సోనియా గాంధీ సభకు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బిఎస్. ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షులు భీంరెడ్డి ఆధ్వర్యంలో 50 వాహనాలతో ర్యాలీగా
కదం తొక్కుతు కదిలిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ విదంగా మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.దొరల పాలనకు విముక్తి పలికి, కుటుంబ పాలనను శాశిస్తున్న కెసిఆర్ ప్రభుత్వంకు వచ్చే ఎన్నికలలో ప్రజలు
తగిన బుద్ది చెపుతారని హెచ్చరించారు.తెలంగాణ వియోచన దినాన్ని పురస్కరించుకొని మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో విజయబేరికి బయలుదేరారని అన్నారు. రాష్ట్రంలో నియంత పాలనకు తగిన బుద్ది చెప్పాలి అంటే తప్ప కుండా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రలో హస్తం రావాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు.
అదేవిధంగా పరిగి గడ్డమీద ప్రజా బంధువు, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి రాంమ్మోహన్ రెడ్డి గెలుపు కొరకు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పని చేస్తున్నారని సూచించారు.ఇప్పుడు పరిస్థితిలో అందరి చూపు కాంగ్రెస్ వైపే ఉందని,అదేవిధంగా రాష్ట్రం యావత్తు హస్తం అధికారంలోకి రావాలని వారు వ్యాఖ్యనించారు.ఇప్పటికే గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని
పేర్కొన్నారు.ముఖ్యంగా పరిగి ప్రాంతంలో ముఖ్య నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే సంక్షేమ పథకాలను గురించి వివరించారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది రూ.500కే వంట గ్యాస్, రూ.5 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం,
రెండు లక్షల రైతు రుణమాఫీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి రావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు.ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఖచ్చితంగా కాంగ్రెస్ దే అధికారమని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు.కాబట్టి ప్రజలు ఎవ్వరు అధైర్య పడవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ ఎంపీపీ అంజిలయ్య గౌడ్, స్థానిక ఎంపీటీసీ ఆనందం,మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.