గులాబీమయమైన బైరంపల్లి గ్రామం
బీజేవైఎం కార్యవర్గ సభ్యులు మల్లేష్ ఆధ్వర్యంలో 50 మంది బీఆర్ఎస్ లో చేరిక
ప్రజా గొంతుక న్యూస్ :షాద్ నగర్
నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండలం బైరంపల్లి గ్రామం బిజెపి సీనియర్ నాయకులు బీజేవైఎం కార్యవర్గ సభ్యులు మల్లేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో 20 మంది చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారికి కాండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ… ఏ రాష్టంలో జరజని అభివృద్ధి మన రాష్టంలో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మూడు గంటల కరెంటు ఇస్తారంట. ఇంతకు మునుపు అధికారం ఉన్నప్పుడు ఏమి చేశారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు. అని ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వారిని నిలదీయాలి. ఒకసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు. మల్లేష్ మాట్లాడుతూ… బీజేపీ పార్టీకి ఎంతో సేవ చేశాను. కానీ సీనియర్ నాయకులను గుర్తించడం లేదు. గ్రామాలలో ఉప్పుడిప్పుడు పార్టీలోకి వచ్చిన వారికీ ఇచ్చిన ప్రాధాన్యత సీనియర్లకు ఇవ్వడం లేదు.. గ్రామంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్నాను. అందువల్ల మనస్థాపానికి గురైయ్యను. అని ఆశభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్ర ఆంజనేయులు, గ్రామ అధ్యక్షులు కృష్ణ, శ్రీకాంత్, సిద్దు, రామయ్య, మొదలగువారు పెద్దఎత్తున పాల్గొన్నారు.