*నిరుద్యోగులు మేల్కొనాలి కేసీఆర్ ను గద్దె దించాలి*
*రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో షాద్నగర్ బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్ డిమాండ్*
రంగా రెడ్డి జిల్లా బ్యూరో :ప్రజా గొంతుక న్యూస్ :-
రంగారెడ్డి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి లింగం స్వేరో ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది, షాద్నగర్ నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం జరిగింది.
షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికైనా నిరుద్యోగ యువత మేల్కొని కేసీఆర్ ప్రభుత్వాన్ని గందెదించాలని పిలుపునిచ్చారు, అంతేకాకుండా సిట్ ఇన్వెస్టిగేషన్లో చైర్మన్ మరియు సభ్యులను ఎస్ఓ వెంకటలక్ష్మిని నిందితులుగా చేర్చాలని,అసమర్థత చైర్మన్ జనార్దన్ రెడ్డి చైర్మన్ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని,
టీఎస్పీఎస్సీ ప్రస్తుతం ఉన్న బోర్డును వెంటనే రద్దుచేసి కొత్త కమిటీని నియమించి మరల గ్రూప్ 1 పరీక్షను నిర్వహించాలని.
నిరుద్యోగులు మేల్కోవాలి కేసీఆర్ ను గద్దె దించాలని, గ్రూప్-1 అభ్యర్థులకు వెంటనే లక్ష రూపాయల నష్టపరిహారం దించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రూప్ వన్ కుంభకోణంలో కేసీఆర్ కేటీఆర్ పాత్రను వెతికి తీసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో జిల్లా వెస్ట్ జిల్లాఅధ్యక్షులు రాచమల్ల జయసింహ, జిల్లాఇన్చార్జులు గ్యార జగన్, గన్నోజు మహేష్ చారి, కోశాధికారి మణుగూరు రాంప్రసాద్ గౌడ్, జిల్లా మహిళా కన్వీనర్ కంబాలపల్లి శాంత, షాద్నగర్ నుండి నియోజకవర్గం ఇన్చార్జిలు గుండేటి నరసింహ, వడ్డే మల్లేష్, షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్, నియోజకవర్గ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బాలయ్య, అసెంబ్లీ బీవీఎఫ్ కన్వీనర్ తొండపల్లి దర్శన్, అసెంబ్లీ బివిఎఫ్ కో కన్వీనర్ అంతారం శ్యామ్ , మండల అధ్యక్షులు తుప్పరి కుమార్ స్వేరో, మైసగళ్ల అనంతయ్య, దుర్గని శ్రీనివాస్, టౌన్ అధ్యక్షులు గాదపాక మోసేజ్, మండల ఉపాధ్యక్షులు రాజేష్ చౌహన్ , ఉపాధ్యక్షులు చంద్రయ్య, మండల ప్రధాన కార్యదర్శి దాన పుల్ల యాదయ్య, మండల సెక్రెటరీ శివగల్ల ఆంజనేయులు, సెక్టర్ అధ్యక్షులు ఉదయ్ కృష్ణ, వెలిజర్ల సెక్టర్ సెక్రెటరీ కావలి అశోక్, వెలిజర్ల గ్రామ బైండ్ల మల్లేష్, కమ్మదనం గ్రామ అధ్యక్షులు మొగిలిగిద్ద జయప్రకాష్, రావిరాల గ్రామ అధ్యక్షులు సాయిలన్న , సీనియర్ నాయకులు పోట్ట నరసింహ తదితరులు పాల్గొన్నారు.