ఎలిగేడు మండలంలో దూసుకొబోతున్న చేయి గుర్తు హవా
ప్రజా గొంతుక న్యూస్/ఎలిగేడు
విజయ రమణారావు గెలుపుకై వైస్ ఎంపీపీ దంపతుల ఇంటింటా ప్రచారం. భారీగా పాల్గొన్న కార్యకర్తలు ప్రజల నుంచి అనూహ్య స్పందన కాబోయే ఎమ్మెల్యే విజయరమణారావు అంటూ హామీలు ఇచ్చిన ఎలిగేడు మండల ప్రజలు.
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు గెలుపు కై ఎలిగేడు మండల వైస్ ఎంపీపీ దంపతులు బుర్ర వీరస్వామి వాణి గౌడ్ ఎలిగేడు మండల కేంద్రంలో శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించి ఆరు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పథకాలపై వివరించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి విజయ రమణారావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ వార్డ్ సభ్యులు మామిడాల రమేష్, తాటి పెళ్లి సతీష్ బాబు, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ రంగు శ్రీనివాస్ ,నాయకులు రాంబాబు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.