*కావాలనే మాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
*అలాంటి దుష్ప్రచారాలను నమ్మకండి
*బీఆర్ఎస్ లోకి వెళ్ళే ప్రసక్తే లేదు.
*జెడ్పిటిసి తాండ్ర విశాల దంపతులు వెల్లడి.
*ప్రజా గొంతుక: రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆర్ ఆర్ గౌడ్
కేశంపేట:కొందరు కావాలనే మాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని,అలాంటి దుష్ప్రచారాలను నమ్మకండని అభిమానులకు,కార్యకర్తలకు,ప్రజలకు సూచించారు కేశంపేట మండలం జెడ్పిటిసి సభ్యురాలు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి దంపతులు.శుక్రవారం పట్టణంలోని ఒక హోటల్లో యాదృచ్ఛికంగా కలిసిన కేటీఆర్ తో ఉన్న ఫోటోను కొందరు మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదంతా మంచి పద్ధతి కాదని అన్నారు.ఇలాంటి విధానాలను నమ్మవద్దని కోరారు.తప్పుడు ప్రచారం చేస్తే బయపడి రాజీకి వస్తారని కొందరు అనుకుంటున్నారని అలాంటి కళలు కలలో మాత్రమే కానీ నిజం కావని తెలుసుకోవాలని సూచించారు.ఇదంతా కొందరు ఆడుతున్న నాటకమని,ఇలాంటి కుట్రలను తిప్పి కొట్టాలని తెలిపారు.
తాను మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానని వస్తున్న వార్తలను ఎవరు నమ్మవద్దని మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు.ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఎవరు నమ్మవద్దని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు మరియు ప్రజలకు విజ్ఞప్తి చేయునది ఏమనగా ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేద్దామని పిలుపునిస్తున్నారు..