Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

దొంగతనానికి దుండగులకు కొత్తదారులు

కోహెడ ఆగస్టు.04 (ప్రజాగొంతుక న్యూస్):- 

దొంగతనానికి దుండగులు కొత్తదారులను ఎంచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో టమాటలను దొంగతనం చేస్తున్న దుండగులు, రైతుల పొలాలలోని వరి గడ్డి కట్టలు కూడా ఎత్తుకెళ్తున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ

మండలంలోని,  పలు గ్రామాల్లో రాత్రి వేళా గుర్తు తెలియని దుండగులు వరి గడ్డి కట్టలు ఎత్తుకెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటన గురువారం రాత్రి మండలంలోని,

వెంకటేశ్వరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రి వేళా గుర్తు తెలియని వాహనాలతో దుండగలు వచ్చి, వరి గడ్డి కట్టలను తీసుకెళ్తున్నారని ఓ బాధితుడు చెబుతున్నాడు. ఇది, ఇలా ఉంటే, గడిచిన రెండు రోజుల క్రితం, మండలంలోని, నాగ సముద్రాల పరిధిలో.. ఓ బాధితుని, ద్విచక్ర వాహనాన్ని కూడా దుండగులు అపహరించినట్లు సమాచారం.

రాత్రి వేళ పోలీసులు నిఘా పెట్టి దుండగలను పట్టుకోవాలని, స్థానికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.