ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడుగా తోళ్ల సురేష్ మాదిగ నియామకం
*ప్రజా గొంతుక ప్రతినిధి/ ఖమ్మం
వివరణ ;- విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన వాటాను సంపాదించి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మాదిగ జాతిని అభివృద్ధిలోకి నడిపించి వెనుకబాటుతనం నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేస్తుంది…
ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఎమ్మార్పీఎస్ సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొన్న ఖమ్మం జిల్లా ఇంచార్జ్ యాతాకుల రాజన్న మాదిగ, మాదిగ మాట్లాడుతూ ” ఎమ్మార్పీఎస్ ఉద్యమం వచ్చిన తరువాతనే మాదిగలు తలెత్తుకొని గర్వంగా జీవించే స్థితిని పొందారని అన్నారు. కులం పేరు చెప్పుకోలేక మానసికంగా
నలిగినపోయిన సమాజానికి ఆత్మగౌరవ చైతన్యం ఇచ్చి మేము మాదిగలం అని చెప్పుకునే దైర్యం ఇచ్చిందని అన్నారు.ఆత్మగౌరవం హక్కులు కోసం ఎమ్మార్పీఎస్ నడుపుతున్న పోరాటంలో ప్రతి మాదిగ బిడ్డ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పిన బీజేపీ నమ్మక ద్రోహానికి పాల్పడిందని అన్నారు. కనుక మాదిగలకు బీజేపీ పార్టీనే ఏకైక శత్రువుగా మిగిలిపోతుందని అన్నారు.బీజేపీకి నిజాయితీ ఉంటే పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం
బీజేపీ ప్రభుత్వం మెడలు వంచడానికి మాదిగ జాతి మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు హైదరాబాదులో జరుగబోయే ఎమ్మార్పీఎస్ జాతీయ విశ్వరూప మహాసభకు పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు.
తోళ్ల సురేష్ మాదిగను ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు.