బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్సిరాం గారికి ఘన నివాళి.
ప్రజా గొంతుక అక్టోబరు 9 దేవరకొండ జిల్లా నల్గొండ
బహుజనుల దిక్సూచి మాన్యశ్రీ కాన్షిరాం 17వ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించటం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఎస్పీ మీడియా & కమ్యూనికేషన్ ఇన్చార్జ్ వింజమూరి శేఖర్ మాట్లాడుతూ.. బహుజనుల రథసారథి అణగారిన వర్గాలకు రాజ్యాధికారం చూపించిన గొప్ప మహనీయుడు బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించి, బహుజనలకు ఉత్తరప్రదేశ్ లో నాలుగుసార్లు రాజ్యాధికారం రుచి చూపించిన మహానుభావుడని, తన జీవితాన్ని బహుజన రాజ్యాధికారం కోసమే ధారపోశాడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బిఎస్పి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎర్ర యాదయ్య, బి.వి.ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ భరత్, ప్రజా గాయకుడు ఆరెకంటి జగన్, సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డం చరణ్ తేజ్, బి.వి.ఎఫ్ కన్వీనర్ కుక్కముడి మురళి, వింజమూరి మల్లేష్, జుట్టు సతీష్, అజయ్, రవి తదితరులు పాల్గొన్నారు.