కొలనుపాక గ్రామంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నివాళులు
ప్రజా గొంతుక/ ఆలేర్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన బిజెపి ఆలేరు మండల అధ్యక్షులు దూసరి రాఘవేంద్ర గారు.
రాఘవేంద్ర గారు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ గారు బిజెపి పార్టీ కి ఒక సిద్ధాంతకర్త, ఏకాత్మత మానవతా సిద్ధాంతన్ని రూపొందించి, ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి రావడానికి మరియు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించడానికి ఆనాడు వారు రచించిన సిద్ధాంతం వాళ్ళనే అన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి ని ఆదర్శంగా తీసుకొని బిజెపి కార్యకర్తలు,
నాయకులు అందరూ ఉత్సాహంగా పనిచేయాలని చెప్పరు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి భాస్కర్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు అంకం రాజు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు తేరాల శంకర్, అంకిరెడ్డి శ్రీనివాస్, భూత్ అధ్యక్షులు గడ్డం సందీప్, నేరేళ్ల రాజు, దూడల లక్ష్మణ్, యువ మోర్చ ఆలేరు అసెంబ్లీ కో కన్వీనర్ వాసం కిషోర్, భరత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.