నిరుపేదలకు అండగా త్రినేత్ర ఫౌండేషన్
*దసరా కానుకగా చీరల పంపిణీ చేసిన మడపతి పరమేశ్వరి నరేందర్
*ప్రజా గొంతుక న్యూస్: రంగారెడ్డి జిల్లా బ్యూరో, ఆర్ ఆర్ గౌడ్
నిరుపేదలకు అండగా త్రినేత్ర ఫౌండేషన్ చేతనందిస్తూ ముందుకు వెళుతుందని ట్రస్ట్ అధినేత అన్నారు. దసరా పండుగ సందర్భంగా పేదవారికి త్రినేత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మడపతి పరమేశ్వరి నరేందర్ మహిళలకు చీరలను అందజేశారు
.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… ట్రస్ట్ సహకారంతో నిరుపేదలందరూ లబ్ధి పొందేలా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నాం, అలాగే టీబీ పేషెంట్లకు ప్రతినెల వారికి పౌష్టికాహారం నిరుద్యోగులకు జాబ్ మేళా వృద్ధులకు నా వంతు చేతనందిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కార్యాచరణతో మరిన్ని మెరుగైన సామాజిక సేవలు అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
పలువురు మహిళలు మాట్లాడుతూ నిస్వార్థంతో ట్రస్టు సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కవితా, పద్మ, అరుణ్, రజిత, అపర్ణ, బుష్ర, ఉమా తదితరులు పాల్గొన్నారు.