*త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీ బి ముక్త్ భారత్
*టీ బీ పేషెంట్స్ కి పౌష్టికాహార కిడ్స్ పంపిణీ చేసిన త్రినేత్ర ఫౌండేషన్ మడపతి పరమేశ్వరి నరేందర్
*ప్రజా గొంతుక :శంషాబాద్ ప్రతినిధి, ఆర్ ఆర్ గౌడ్*
శంషాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో టీ బీ పేషెంట్స్ కి పౌష్టికాహార కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది త్రినేత్ర ఫౌండేషన్ తరఫున మడపతి పరమేశ్వరి నరేందర్ పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా పరమేశ్వరి నరేందర్ మాట్లాడుతూ.. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో క్షయవ్యాధి ఒకటి. క్షయ అనేది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఒక అంటు వ్యాధి.
వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమయ్యే బ్యాక్టీరియా గాలిలోకి చేరి.. వేరే వ్యక్తికి సోకే ప్రమాదముంది. దీని తగ్గించుకోవడం కోసం ఎక్కువ కాలం మందులు వాడాల్సి ఉంటుంది. దీంతో పాటు సరైనా ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం,రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు టీబీ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో, వైరస్, బాక్టీరియాకు వ్యతిరేకంగా శరీరాన్ని బలోపేతం చేయడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్షయవ్యాధికి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తికి రక్షణగా పనిచేస్తుంది.
బలహీనత, అనుకోకుండా బరువు తగ్గడం, అలసట, దగ్గు, జ్వరం ఇవన్నీ టీబీ లక్షణాలే. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల.. రోగి చాలా వరకు ప్రయోజనం పొందవచ్చు.ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కవిత పద్మ అరుణ రజిత అపర్ణ బుష్రా ఉమా తదితరులు పాల్గొనడం జరిగింది