పండుగ పూట రోడ్డు ప్రమాదంలో కవలల మృతి –చావు బ్రతుకుల్లో తల్లి
మెదక్ ప్రజా గొంతుక న్యూస్
మెదక్: దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని భావించిన ఆ కుటుంబంలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. మెదక్ పట్టణంలోని ఆటో నగర్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుమారులు తల్లి కళ్లేదుట మృతి చెందారు.ఆటో నగర్‌లో నివాసముంటున్న తల్లి అన్నపూర్ణ, కుమారులు కవలలు, పృథ్వీరాజ్(12), ప్రణీత్‌తేజ్(12) పండుగ కు పటాకులు కొనడానికి మార్కెట్‌కు బయలు దేరారు. తల్లి స్కూటీని నడిపిస్తుండగా టిప్పర్ వచ్చి ఢీ కొనడంతో ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
అన్నపూర్ణకు గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అన్నపూర్ణ భర్త శ్రీనివాస్ హోంగార్డ్‌కు విధులు నిర్వహిస్తూ రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. నాడు భర్త, నేడు పిల్లలు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.