*లింగంధన గ్రామం నుంచి ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్*
ప్రజా గొంతుక :షాద్ నగర్ ప్రతినిధి
కేశంపేట మండల పరిధిలోగల లింగందన గ్రామం నుంచి, 1) నాగిళ్ల మౌనిక D/0 నరసింహ.
2) నెల్లికంటి కుమార్ s/0 అంజయ్య, ఈ ఇద్ధరు AR పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపిక అయ్యారు.
రెక్క ఆడితే కానీ డొక్క ఆడని నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈ ఇద్దరు, ఎంతో కష్టపడి పై చదువులు చదివి పోలీస్ జాబ్ కోసం రెండుసార్లు ఫేయిల్ అయ్యి, ముచ్చటగా మూడోసారి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొట్టేశారు, నిరుపేద కుటుంబంలో జన్మించిన ఇద్దరికీ పోలీస్ జాబ్స్ వచ్చినందుకు గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు