సుల్తానాబాద్ మండలంలో ఇటుక లారీ బోల్తా ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి
ప్రజా గొంతుక న్యూస్/సుల్తానాబాద్
ఇటుక లారీ బోల్తా పడి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది.
శనివారం పెద్దపల్లి నుండి కరీంనగర్ కు ఇటుకలోడు తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అటువైపుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు లారీ కిందపడి శివపల్లి గ్రామానికి చెందిన అమ్ముల బుచ్చయ్య (65) మృతి చెందాడు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సిఐ జగదీష్,ఎస్సై విజయేందర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.