రిలే దీక్షలు చేపట్టిన’సమగ్ర శిక్షా ‘ ఉద్యోగుల జేఏసీ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో….
ప్రజా గొంతుక పెద్దపల్లి జిల్లా :
విద్యాశాఖలో పని చేయుచున్న ‘సమగ్ర శిక్షా ‘ ఉద్యోగుల జేఏసీ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద తేదీ 28.08.2023 నుండి రిలే దీక్షలు చేపట్టడం జరిగింది.
గత 16 సంవత్సరాలుగా విద్యాశాఖ విభాగమైన ‘సమగ్ర శిక్షలోని వివిధ విభాగాల్లో కాంటాక్ట్ విధానంలో చాలిచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు.
తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని తెలంగాణా ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చురుకుగ్గా పాల్గొని తెలంగాణ సాదించుకుంటే వారి జీవితాల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరం అన్నారు.
ఉద్యమ కాలంలో పలు సభలల్లో సీఎం కెసిఆర్ మాట్లాడుతూ,, కాంట్రాక్టు ఉద్యోగులు అనే పదం లేకుండా చేస్తానని, కాంట్రాక్టు ఉద్యోగుల అందరినీ క్రమబద్దీకరిస్తామని హామీలిచ్చి ఇంకా అమలు చేయకపోవడం చాలా బాధాకరం అని వాపోయారు.
ప్రత్యేక తెలంగాణ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు మాత్రం 2019 నుండి ఎం టి ఎస్ (మినిమం టైం స్కేల్ ) పొందుతున్నా తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగుల బతుకులు బంగారు మయం అవుతాయని ఆశపడ్డ వారి ఆశలు బంగమయ్యాయి. చాలిచాలని వేతనాలతో, రోజూ రోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సతమతమవుతూ కుటుంబ పోషణ కష్టమై అప్పుల భారంతో సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారని అన్నారు.
గౌరవ సుప్రీం కోర్టు “సమాన పనికి సమాన వేతనం” అమలు చేయాలని తీర్పు ఇచ్చినప్పటికి దానిని అమలు చేయకపోవడం విచారకరం అన్నారు. మరియు 2018 లో పి ఆర్ సి కమిటీ కాంట్రాక్ట్ ఉద్యోగికి కనీస వేతన స్కేలును అమలు చేయాలని ప్రతిపాదించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికలను అమలు చేయకపోవడం కాంట్రాక్ట్ ఉంగుల పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు.
ఇటీవల ఒడిశా, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో సమగ్రశిక్షా ఉద్యోగులను క్రమబద్దీకరించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు., అదేవిధంగా ఇప్పటికైనా తెలంగాణా ప్రభుత్వం సమగ్ర శిక్షా లో పని చేస్తున్న ఉద్యోగులందరిని క్రమబద్దీకరించాలని, అప్పటి వరకు వెంటనే ఎం టి ఎస్ ( మినిమం టైం స్కేల్) ను 2019 నుండి వర్తింతప చేసి దాదాపు 22 వేల మంది సమగ్ర శిక్షా ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో ఓదెల మండలం సమగ్ర శిక్షా జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సమగ్ర శిక్ష ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.