Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

తెలంగాణ ప్రజాపంట్ ఆధ్వర్యంలో గద్వాలలో ఘనంగా…

 

అమరుడు పులిమామిడి మద్దిలేటి(9)వవర్ధంతివేడుకలు.

 

 

ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.

 

జోగులాంబగద్వాలజిల్లా కేంద్రంలోని (2) వ రైల్వే గేటు దగ్గర శనివారము పులిమామిడి మద్దిలేటి స్థూపం వద్ద ఆయన (9) వ వర్ధంతిని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. టీపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ శంకర ప్రభాకర్అధ్యక్షతనజరిగినసమావేశంలోతెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడుజక్కులవెంకటయ్యమీడియాతోమాట్లాడుతూ మద్దిలేటి మళ్లీ దిశ తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పనిచేసిభౌగోళికతెలంగాణ కాదు, ప్రజాస్వామ్యక తెలంగాణ కావాలని ఆనాడే పత్తి రైతులకు అన్యాయంజరుగుతుందని జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి, లాఠీదెబ్బలకుభయపడక జైలు జీవితం కూడా గడిపినఆయన(పులిమామిడిమద్దిలేటి)ఆశయాలను కొనసాగించాలని జక్కుల వెంకటయ్య అన్నారు.

 

ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆయన చేసినసేవలనుకొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తు వీలైనప్పుడల్లా అంబేద్కర్ యువజన సంఘం లో పనిచేస్తూ, తెలంగాణ జన సభ, ఏపీ సిఎల్సిసి,ఏపీటీఎఫ్ లలో కూడా చురుకైన వ్యక్తిగా పనిచేయడం వల్ల తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు ఇలాంటి వ్యక్తి అవసరమని అప్పుడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో కార్యకర్తగా చేరిరాష్ట్ర అధ్యక్షుడిగాతెలంగాణకు ఎనలేని సేవచేశారని, ప్రజాస్వామ్యతెలంగాణరావాలనిఆయనకోరుకునేవాడనిఅందరంకలిసికట్టుగాఆయనఆశయాలను కొనసాగించాలని వక్తలు అన్నారు.

 

ఈకార్యక్రమంలోతెలంగాణ రైతన్న సమితి రాష్ట్ర ప్రధాకార్యదర్శి గోపాల్, పౌర హక్కుల సంఘం మహబూబ్ నగర్ఉమ్మదిజిల్లాఅధ్యక్షుడు శుభాన్, కే ఎన్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు రవికుమార్, జర్నలిస్ట్ ఇస్మాయిల్, మద్దిలేటి కూతురు లలిత, బావ భాస్కర్,ఎల్కూరుమహేష్ ఇతరులు పాల్గొని నివాళలర్పించారు.

Leave A Reply

Your email address will not be published.