ఏ ఐ టి యు సి 104వ ఆవిర్భావ దినోత్సవ
కాసిపేట టు గని జెండా ఎగరవేసిన యూనియన్ నాయకులు
బెల్లంపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు బియ్యాల వెంకటస్వామి ఫిట్ సెక్రెటరీ గొల్ల శ్రీనివాస్
ప్రజా గొంతుక న్యూస్ మంచిర్యాల జిల్లా కాసిపేట కోల్ మైన్స్. మంగళవారం ఏ ఐ టి యు సి 104.వ. దినోత్సవాన్ని కాసిపేట టు మైన్సులో నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు బియ్యాల వెంకటస్వామి పాల్గొన్నారు. కార్మికుల తో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం.మాట్లాడుతూ
దేశంలో మొట్ట మొదటి కార్మిక సంఘం ఏ ఐ టీ యు సి.1920 అక్టోబర్ 31వ తేదీన ఆవిర్భవించి.సింగరేణిలో మొదటి కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్. ఏ ఐ టి యు సి
1942 మే 1వ తేదీన కొత్తగూడెం హేమచంద్రపురం అడవుల్లో అతి రహస్యంగా కామ్రేడ్ దేవురి శేషగిరిరావు,
మగ్దుం మొయినుద్దీన్, సర్వే దేవపట్ల రామనాథం మనుబోతుల కొమురయ్య ఆధ్వర్యంలో స్థాపించినారు
కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి చివరికి వారి యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేయడం జరిగింది
అలాంటి గొప్ప చరిత్ర గల కార్మిక సంఘం ఏదైనా ఉందంటే అది ఒక సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ మాత్రమేనని, సింగరేణిలోని లాభాల వాటా, దీపావళి బోనస్, పెన్షన్, ఎనిమిది గంటల పని దినాలు అనేక కార్మిక చట్టాలను కార్మికుల కోసం తీసుకువచ్చిన సంఘం ఏ ఐ టి యు సి మాత్రమే అని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్, పి ట్ కమిటీ ఉపాధ్యక్షులు కొండపల్లి నరసయ్య, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ బొద్దుల వెంకటేష్, మైనింగ్ స్టాఫ్ ఉపాధ్యక్షులు. మొయినుద్దీన్, నీలయ్య, రాజ కొమరయ్య, రత్నం రాయలింగు, దేవులపల్లి శ్రీనివాస్, సతీష్, సిరికొండ రాకేష్, సాగర్, అంజి, తిరుపతి, సురేష్. కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు.