బాధిత కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందజేసిన
రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్
*ప్రజా గొంతుక న్యూస్ :రంగా రెడ్డి జిల్లా బ్యూరో ఆర్. ఆర్. గౌడ్*
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని గట్టుఇప్పలపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రాచర్లపల్లి జంగయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామున మరణించడం జరిగింది.ఈ విషయం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ముకురాల అశోక్ గౌడ్ ద్వారా రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ కు తెలియజేయడం జరిగింది.వెంటనే స్పందించిన జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ…
తమ ట్రస్టు ద్వారా తక్షణ సహాయంగా బాధిత కుటుంబానికి ముకురాల అశోక్ గౌడ్ ద్వారా 3000 రూపాయలు మరియు తలకొండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి బాధితులకి 3000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సమన్వయ గ్రామ అధ్యక్షుడు సొప్పరి శ్రీను ,మట్ట అంజయ్య, కృష్ణయ్య సార్, పవన్ వాల్మీకి,నాగేష్ యాదవ్ ,బోయ శేఖర్, బోయ కిషన్ వాల్మీకి, బోయ ఆంజనేయులు వాల్మీకి,కల్వకోలు విష్ణు,తదితరులు పాల్గొన్నారు.