ఖాళీ అవుతున్న ప్రతిపక్ష పార్టీలు
“గులాబీ గూటికి….. క్యూ”
ప్రజలందరి మద్దతు బిఆర్ఎస్ పార్టీకే
-చేరికలు జోరు.. బిఆర్ఎస్ హోరు
ప్రజా గొంతుక అక్టోబర్ 2 దేవరకొండ జిల్లా నల్గొండ
-దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుందని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.సోమవారం పిఏపల్లి మండలం గడ్డమీది తండాకు చెందిన 50 మంది ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. .
బీఆర్ఎస్ లో చేరిన వారికి గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తమ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….. బీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని అని ఆయన అన్నారు.ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు.పేద ప్రజలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది అని ఆయన అన్నారు.
పేదల తలరాత మార్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీది అని ఆయన అన్నారు.పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.స్వరాష్ట్రంలో పేదల జీవితంలో కొత్త వెలుగులు నింపడం జరిగింది అని ఆయన అన్నారు.దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన పేదల ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అని ఆయన తెలిపారు.పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన అన్నారు.తెలంగాణలో ప్రతి గడప గడపకు సంక్షేమం అని ఆయన అన్నారు.తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, పి ఏ సి ఎస్ చైర్మన్ వెల్లుగురి వల్లపు రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్,అర్వపల్లి నర్సింహా,పాల్వాయి రంగా రెడ్డి,తెర మణిపాల్ రెడ్డి,రమావత్ రవి,ఎర్ర యాదగిరి,బురం గురవయ్య,గుండాల శ్రీనివాస్,దయాకర్ రెడ్డి,బోయా సుధాకర్ రెడ్డి,శ్రీనివాస్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.