విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి : సీపీ రామగుండం
కమీషనరేట్ లో ఆయుధ, వాహన పూజలు
ప్రజా గొంతుక పెద్దపెల్లి :
విజయదశమి పండుగ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ ల ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, రామగుండం పోలీస్ కమిషనరేట్ అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని కోరుతూ రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్., (డిఐజి) ఆకాంక్షించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో పోలీస్ కమీషనర్ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారని అన్నారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం వాహనాల పూజ నిర్వహించి అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పూజా కార్యక్రమాలలో గోదావరిఖని ఏసిపి తుల శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఏ ఆర్ ఏ సి పి మల్లికార్జున్, సీఐ లు ప్రమోద్ రావు, చంద్రశేఖర్, వేణుగోపాల్, ప్రసాద్ రావు, అశోక్, ఆర్ ఐ లు దామోదర్, మల్లేశం, విష్ణు ప్రసాద్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం, ఎస్ఐ ఆర్ఎస్ఐ లు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.