10 నెలల క్రితం పోయిన మొబైల్
ఇక దొరకదు అనుకున్న సమయంలో
పట్టువదలని విక్రమార్కులు పోలీసులు ఆ మొబైల్ ను వెతికించారు
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపురం గ్రామంలో ఎండి మసూద్ కు చెందిన మొబైల్ అతను చేర్యాలకు వెళ్తున్న క్రమంలో పోయింది తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫిర్యాదుని స్వీకరించి పోలీస్ శాఖ (సీఈఐఆర్) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పేరుతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తో పోయినా స్మార్ట్‌ఫోన్ ను కనుగొని ఎస్సై కంకల సతీష్ అతనికి అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్సై కంకల సతీష్ మాట్లాడుతూ ఏదైనా పరిస్థితులలో మొబైల్ పోయినచో పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరారు. తమ వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఎలాంటి సమయంలో అయినా పోలీసులు మీకు అండగా ఉంటారని అత్యవసర పరిస్థితులలో 100 కు కాల్ చేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా బాధితుడు ఎండి మసూద్ మాట్లాడుతూ పోయిందనుకున్న మొబైల్ దొరకడంతో సంతోషంగా ఉందని, పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు ఈ సందర్భంగా శాలువలతో ఎస్సై సతీష్ ని, కానిస్టేబుల్ ను సన్మానించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, జ్యోతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.