ఓటర్ నమోదు.ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మంచిర్యాల.జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్
ప్రజా గొంతుక న్యూస్
మంచిర్యాల జిల్లా: 2వ ఓటరు జాబితా సంక్లిప్త పునరీక్షణ కార్యక్రమం-2023లో భాగంగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను 18 సం||లు నిండిన వయస్సు అర్హత గల వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్,
జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ పేర్కొన్నారు. జిల్లాలోని నస్పూర్ గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 235 నుండి 238 వరకు గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. జిల్లాలో 18 సం||లు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు నమోదు చేసుకోవాలని, నూతన ఓటరు నమోదుతో పాటు ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపులకు
ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలలో నూతన ఓటరు నమోదు, సవరణలు, మార్పులు, తొలగింపుల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, జిల్లాలో అక్టోబర్ 1, 2023 నాటికి 18 సం||లు నిండి వయసు అర్హత గల ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, సంబంధిత 6, 7, 8 దరఖాస్తు ఫారములు బూత్ స్థాయి అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని, ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.