మీకోసం మేమున్నాం టీం దిగ్విజయంగా 98 వ వార అన్నదానం
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
చర్ల గాంధీబొమ్మ సెంటర్ వద్ద సుమారు 200 మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం జరిగింది. కవలలు అనూష & సందీప్ జన్మదినోత్సవం సందర్భంగా, వారి తల్లిదండ్రులు అన్నదాతలు ఆడెపు నర్సింహమూర్తి-ఇందిర దంపతులు పంపిన 5,000 /- వితరణతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ విధంగా మన శుభకార్యాలను పేదలతో పంచుకుని, వారి ఆకలి తీర్చడమనే సాంప్రదాయం ఎంతో ఔన్నత్యంతో కూడుకున్నదని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆడెపు ముత్యాలరావు, శ్రీమతి పద్మ, పరిటాల రమణ, ఎంవి.ఎస్.ఎన్ చారి, దొడ్డి సూరిబాబు, దొడ్డి రమణారావు, సొల్లంగి నాగేశ్వరరావు, దొడ్డ ప్రభుదాస్, కొమారి శ్రీను, భద్రం, వరికల శ్రీను,గొమ్ముగూడెం చారి, కనుకు వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.