*మైనార్టీలకు ఎంతో చేశాం. మరింత చేస్తాం
*నిరుపేద ముస్లింలకు అండగా ఉంటానని హామీ..
*మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్*
*బిఆర్ఎస్ తోనే అందరికీ న్యాయం చేస్తుంది*
*హోమ్ శాఖ మంత్రి మొహమ్మద్ అలీ, వర్కు చైర్మన్ సలీం, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*
*ప్రజా గొంతుక:రంగా రెడ్డి జిల్లా బ్యూరో*
రాజేంద్రనగర్ నియోజగవర్గం అత్తాపూర్ డివిజన్ చింతల్ మెట్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ అధ్వర్యంలో మైనార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మొహమ్మద్ అలీ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం, పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దు బిఆర్ఎస్ తోనే అందరికీ న్యాయం జరుగుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమాలు పరుగులు తీస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, నీటి కష్టాలు పోయాయి అన్ని వర్గాల ప్రజలకు మైనార్టీ సోదరులకు ఎంతో చేశామని, మరింత చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తనను ఆదరించి మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందనిరాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి టీ. ప్రకాష్ గౌడ్ మైనార్టీలకు పిలుపునిచ్చారు.
మైనార్టీలు రాజకీయంగా ఎదిగేందుకు కృషీ చేస్తున్నానని, నిరుపేద ముస్లింలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ముస్లింలు నిజాయితీ పరులుమాట ఇస్టే తప్పరని పేర్కొన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఎర్పాటు చేశామన్నారు షాదీఖానా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు.నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో పనులు చేశామని, మరోసారి తన ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శంషాబాద్ జడ్పీటీసీ తన్వి రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.