ఎమ్మెల్సీ పోచంపల్లి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రమణా రెడ్డి చొరవతో ఇప్పటివరకు 60 లక్షల వ్యయంతో 25 కాలనీలు సిసి రోడ్లు వేయించాం
భవాని శశిధర్ రెడ్డి.. నాగిరెడ్డిపల్లె గ్రామ సర్పంచ్
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట నాగిరెడ్డిపల్లి సర్పంచ్ భవాని శశిధర్ రెడ్డి మాట్లాడుతూ. మా గ్రామాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దత్తత తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి,మా గ్రామ పంచాయతీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.అని ఇప్పటివరకు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పని చేసుకుంటూ పోతున్నాం.ఈజీఎస్ నిధుల క్రింద రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రమణా రెడ్డి చొరవతో ఇప్పటివరకు 60 లక్షల వ్యయంతో 25 కాలనీలు సిసి రోడ్లు వేయించాం..
మరియు 20 లక్షల వ్యయంతో మన ఊరు మనబడి కార్యక్రమంలో మా యుపిఎస్ పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది.. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ విభాగంలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు కూడా పోటీ పడుతున్నాం…
కొన్ని కాలనీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కులు చేయడం జరిగింది.. ఇంకా కొన్ని కాలనీలు అండర్ డ్రైనేజీ చేయాల్సి ఉంది.. కొన్నే నుంచి వీరన్న పేటకు బీటీ రోడ్డు ఏడు కిలోమీటర్లు ఎస్టిమేషన్ చేపించాము..
ఇట్టి బీటు రోడ్డు సాంక్షన్ అయితే మా గ్రామం నుంచి వీరన్న పేటకు కొన్నెకు వెళ్లే రైతులకు.. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుంది..
బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ గా పార్టీ ఆదేశాల మేరకు ఎవరికి బి ఆర్ ఎస్ టికెట్ వచ్చిన కూడా మా వంతు పూర్తి సహకారం అందించి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు.
మా గ్రామ అవసరాలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దృష్టికి తీసుకుపోయిన. ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ గొల్లపల్లి ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి మల్లేష్ గౌడ్,కు అభినందనలు తెలియజేశారు.