*గులాబీ కోట బద్దలు కొడతాం..!
*బుక్క వేణుగోపాల్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
*మోడీ ప్రజా గర్జన సభ విజయవంతం కావడంపై కార్యకర్తలకు అభినందనలు
*మోడీ శంఖారావంతో కార్యకర్తలకు స్ఫూర్తి
*రాజేంద్ర నగర్ :అక్టోబర్ 1ప్రజా గొంతుక న్యూస్
ప్రజాగర్జన సభ’’లో ప్రధాని మోదీ హామీల వర్షం కురిపించారనీ పాలమూరు సభలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని ఇది శుభానికి సంకేతం అని రాబోయే రోజుల్లో గులాబీ కోటలను బిజెపి సైనికులు బద్దలు కొడతారని కాషాయ జెండాను ఎగురవేస్తామని భారతీయ జనతా పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ నాయకులు అన్నారు.
ఆదివారం ప్రధాని మోడీ పాలమూరు పర్యటనకు శంషాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని వేలాదిగా పెద్ద ఎత్తున పాలమూరుకు తరలించారు. ఈ సందర్భంగా మోడీ సభ విజయవంతం కావడంతో కార్యకర్తలకు అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసిందని.. పసుపు పంటపై పరిశోధనలు పెరిగాయని మోడీ చెప్పడం చూస్తుంటే పసుపు రైతులపై కేంద్రానికి ఉన్న ప్రేమ ఏ పాటిదో తెలుస్తుందని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో.. తెలంగాణలోని పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలంగాణలో రూ.13,500 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం శ్రీకారం చుట్టామన్నారు. కేంద్రం చేపట్టిన పనులతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని మోడీ భరోసా కల్పించారనీ దేశంలో పండుగల సీజన్ మొదలైందన్నారు. తెలంగాణలో పసుపు పంటను అధికంగా పండిస్తారని చెప్పారు. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొవడం శుభ సూచకమని అన్నారు.
అదే విధంగా జాతీయ రహదారులు, రైల్వేతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని కాచిగూడ-రాయ్ చూర్ మధ్య నూతన రైలును ప్రారంభించారని హసన్- చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైపులైన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారనీ వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారనీ, కృష్ణపట్నం- హైదరాబాద్ మల్టీ లెవల్ ప్రాజెక్టు పైపులైన్‌ను ప్రారంభించారనీ రూ.2457 కోట్లతో నిర్మించనున్న సూర్యాపేట-ఖమ్మం హైవేకు శంకుస్థాపన చేశారని మోడీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని బుక్క వేణుగోపాల్ వివరించారు..