*ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అంజన్నను గెలిపించుకుంటాం
*కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమ్ము వెంకటయ్య
*కొమ్ము వెంకటయ్యకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
*ప్రజా గొంతుక రంగారెడ్డి జిల్లా బ్యూరో, ఆర్.ఆర్.గౌడ్*
ముచ్చటగా మూడోసారి షాద్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తిరిగి అంజయ్య యాదవ్ ని గెలిపించుకుని తీరుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్ము వెంకటయ్య పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు నందిగామ మండలంలో కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకులు కొమ్ము వెంకటయ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున
బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గులాబీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొమ్ము వెంకటయ్య మాట్లాడుతూ నందిగామ మండలన్ని అభివృద్ధి చేసినందుకు భారీ మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, మంత్రి గా కావాలని ఆకాంక్షించారు. నందిగామలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, నందిగామలో ఆర్టీసీ బస్సులు ఆగడం లేదు కనుక విద్యార్థులకు కాలేజీకి పోయే విద్యార్థులకు చాలా ఇబ్బందికి గురవుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి సమస్యలన్నీటికి ఎమ్మెల్యే అంజన్న హామీ ఇచ్చి ప్రతి ఒక్కటి పరిష్కరిస్తానని భరోసనిచ్చారు.