*ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం
*లక్ష మెజార్టీ లక్ష్యంతో పనిచేస్తాం కోట్ల ప్రశాంత్ రెడ్డి 24వ,వార్డ్ కౌన్సిలర్.
ప్రజా గొంతుక జడ్చర్ల/ ప్రతినిధి:
జడ్చర్ల నియోజకవర్గాన్ని కనీవినీ, ఎరగని రీతిలో అభివృద్ధి చేసిన జననేత లక్ష్మారెడ్డి.గతంలో జడ్చర్ల పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు నియోజకవర్గంలో ఎక్కడ పనులు జరగలేదు నేడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి ప్రగతి పలాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు చేరుతున్నాయి.వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు నిరంతరంగా కొనసాగుతుంది.పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. వికలాంగులకు వాహనాలు. వృద్ధులు,వితంతువులకు పెన్షన్. గ్రామాలు మొదలుకొని పట్టణాలలో సిసి రోడ్ల నిర్మాణం.ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్.కెసిఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందించే అభివృద్ధి పలాలను అందజేసిన గొప్ప నాయకుడు లక్ష్మారెడ్డి.జడ్చర్ల నియోజకవర్గనికి పారిశ్రామిక క్యాడర్ తీసుకొచ్చి వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రజా నాయకుడు.జడ్చర్ల పట్టణానికి సమీపంలో ఉన్న కార్వేనా రిజర్వాయర్, ఉదండాపూర్ రిజర్వాయర్లను సాధించిపెట్టిన అపర భగీరథుడు.ఈసారి జరిగే ఎన్నికల్లో తన గెలుపు ఏకపక్షంగానే ఉంటుంది అత్యధిక మెజార్టీతో గెలిచి తిరిగి కెసిఆర్ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. మన 24వ వార్డు ఓటర్ మహాశయులంతా లక్ష్మారెడ్డి వెంటనే ఉన్నామని గంటపదంగా తెలియజేస్తున్నాను.ఇంకా మన 24 వ వార్డులో ఏవైనా చిన్న చిన్న పనులు ఆగిపోయి ఉంటే తిరిగి లక్ష్మారెడ్డి గెలిచిన తర్వాత అన్ని అభివృద్ధి పనులను వారి సహకారంతో పూర్తి చేస్తాను.ఈసారి అత్యధిక మెజార్టీతో లక్ష్మారెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.