సంక్షేమ పథకాలే కేసీఆర్ ను గెలిపిస్తాయి…. చిట్కుల మహిపాల్ రెడ్డి
మనోహరాబాద్ 06నవంబర్(ప్రజా గొంతుక)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మూడోసారి కెసిఆర్ ను గెలిపిస్తారని రాష్ట్ర కెసిఆర్ సేవాదళం ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర సర్పంచ్ ల పోరం కన్వీనర్,స్థానిక సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి అన్నారు.
సోమవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో వారు ఏర్పాటు చేసిన సమావేశానికి కెసిఆర్ సేవాదళం వ్యవస్థాపకుడు మహమ్మద్ అమీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.వారు కార్యకర్తలతో కలసి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహమ్మద్ అమీర్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజిక వర్గంలో పర్యటించడం చాలా సంతోషంగా ఉన్నదని,కెసిఆర్ అంటే తెలంగాణ అభివృద్దికి సూచిక అని అన్నారు.తెలంగాణలో అయన చేసిన అభివృద్ధి దేశంలోని అన్నిరాష్ట్రాలకు ఆదర్శమన్నారు.కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలుగా ఆదుకున్నాయన్నారు.
రాష్ట్రాల లోని అన్ని నియోజిక వర్గాల్లోని బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడమే కాకుండా భారీ మెజారిటితో కెసిఆర్ ను గెలిపించి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కెసిఆర్ సేవాదళం పర్యటించడమే కాకుండా ప్రతి కార్యకర్త వెంట ఉంటూ వారికి భరోసాను కల్పిస్తూ,కెసిఆర్ గెలుపు కోసం అనునిత్యం శ్రమిస్తామని వారన్నారు.కెసిఆర్ తెలంగాణాను అన్ని విధాలుగా అభివృద్ధి పరచి,దేశానికి ఏవిధంగా ఆదర్శంగా నిలిపాడో,అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా భారత దేశాన్ని ప్రపంచ దేశాలు అబ్బురపరిచే విధంగా అభివృద్ధి చేస్తారని వారన్నారు.అనంతరం చిట్కుల మహిపాల్ రెడ్డి మాట్లడుతూ రాష్ట్ర అభివృద్ది కోసం కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లడమే కాకుండా కార్యకర్తల బాగోగులు చూసుకోవడమే కెసిఆర్ సేవాదళం ముఖ్య ఉద్దేశ్యమని వారన్నారు.అమీర్ ఉద్యమం మొదలు నుండి నేటి వరకు కెసిఆర్ వెంటే ఉన్నాడని,సేవాదళం ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో మాతో పాటు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.అత్యధునిక హంగులతో డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం,తాగునీరు,నిరంతరం విద్యుత్,బస్తి దవాఖానాలు,కెసిఆర్ కిట్స్,పించన్లు,ఇలా అనేకమైన సంక్షేమ పతకాలను ప్రవేశ పెట్టి సీఎం కెసిఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.సౌభగ్యలక్ష్మి పథకం కింద సుమారు 9 లక్షల మందికి ప్రతి నెల 3 వేలు ఇచ్చే విధంగా మేనుఫెస్టో తయారు చేయడం జరిగిందన్నారు.రైతు బంధును విడతల వారీగా పెంచుతారని తెలిపారు.ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ సేవాదళంతో పాటు అందరం పాల్గొని,గజ్వేల్ అంటే కెసిఆర్ అడ్డ అనే విధంగా భారీ మెజారిటితో గెలిపిస్తామని వారన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధర్మేందర్,మాజీ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి,ప్యాక్స్ డైరక్టర్ జావేద్ పాషా,యూత్ వింగ్ ప్రెసిడెంట్ రాహుల్ రెడ్డి,రమేష్,లాయఖ్,కెసిఆర్ సేవాదళం సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.