ఏం అభివృద్ధి చేశారని! ఓట్లు అడగడానికి వస్తున్నారు
బీఎస్పి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి దాసరి ఉష.
ప్రజా గొంతుక న్యూస్/సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలో 38వ రోజు మన ఊరు – మన ఉష కార్యక్రమంలో పాల్గొన్న బిఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష. ఈ సందర్భంగా గడపగడపకు ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల దోపిడిని ఎండగాడుతూ, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ బీఎస్పి ప్రభుత్వం లోకి వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
అనంతరం దాసరి ఉష
మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి దోచుకున్న సొమ్ముతో ప్రజల్ని మభ్య పెట్టడానికి గ్రామాల్లోకి వస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి ప్రజలకు గత తొమ్మిది సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు? ప్రజలే ఇంకా ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్పే మాయ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. గత 38 రోజుల నుండి 75 గ్రామాలలో ప్రతి ఇంటింటిని సందర్శించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు
ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు నార్లగోపాల్ యాదవ్, అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ ఆముదల అరుణ, సుల్తానాబాద్ మండల కోశాధికారి అల్లేపు చంద్రశేఖర్, బీఎస్పీ నాయకులు, సింగసాని అనిల్,రోహిత్ , మనోహర్, ఎలుగం రామస్వామి, ఏలుగం రాకేశ్, ఎలేగేటి సదానందం, అల్లేపు శృతి, బివిఫ్ జిల్లా కన్వీనర్ మచ్చ రాహుల్, బీవిఫ్ టీం, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు