పాలకులకు పట్టింపు ఏది… స్పెషల్ ఫోకస్ ప్రజా గొంతుక
గుంతలు గుంతలుగా మారిన రోడ్డు. జనగామ జిల్లా జనగామ నుండి హుస్నాబాద్ వెళ్లే రహదారి మధ్యలో గానుగుపహాడ్ బ్రిడ్జ్ కుంగి మరమ్మత్తులకు నోచుకోకుండా దాదాపు 6, 7 నెలలు కావస్తున్న అటు అధికారులు ఇటు అధికార ప్రతినిధులు ఎవ్వరు పట్టించుకో ఇవ్వడం లేదంటూ ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జనగామ నుండి హుస్నాబాద్ వెళ్లే మార్గమధ్యంలో గానుగుపహాడ్ ఊరి మధ్యలో నుండి వెళ్లడం వలన వర్షం పడినప్పుడు బురదమయం, మరలా ఎండ కొట్టినప్పుడు దుమ్ముతో ఇల్లు పాడవుతున్నాయని వాపోతున్నారు,
పాలకులకు జిల్లా టికెట్టుపై ఉన్న ప్రేమ, రహదారి మరమ్మత్తులపై లేదని అనుకుంటున్నారు ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తక్షణమే బ్రిడ్జిని వేసే విధంగా పనులు జరపాలని స్థానికులు ప్రయాణికులు అనుకుంటున్నారు.