అంబేద్కర్ గారికి దండ వేసిన సమయంలో…!
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన పాదాలకు వేసుకుంది బూట్ల..! సాక్స్లు ల..?
ప్రజా గొంతుక న్యూస్ డెస్క్/ జనగామ
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ,మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి
బూట్లు వేసుకొని పూలమాలు వేశారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొందరు దళిత నాయకులు వెంటనే కొమ్మూరు ప్రతాపరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కాంగ్రెస్ పార్టీ వారిని సస్పెండ్ చేయాలని పోస్ట్లు పెడుతున్నారు .
అంబేద్కర్ గారి స్టేజ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎక్కినప్పుడు పాదాలకు సాక్స్లు లతో ఉన్నారని,ఎక్కడ ఆ గౌరవంగా
ప్రవర్తించలేదు అని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటే అభిమానం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొందరు కాంగ్రెస్ నాయకులు పోస్టులు పెడుతున్నారు.
మరి ఈ విషయంపై కొమ్మురి ప్రతాప్ రెడ్డి నుండి వివరణ రావాల్సి ఉంది.