Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

*ఎంపీటీసీగా గెలవని వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేగా గెలుస్తాడా..?*

 

*రేపు ఉదయం 10 గంటల లోపు వీర్లపల్లి శంకర్ ను మార్చితే కాంగ్రెస్ కు పని చేస్తా..!*

 

*లేదా 48 గంటల్లో నా సత్తా ఏంటో చూపిస్తా..!*

 

*మామూలు కాంగ్రెస్ కార్యకర్తకు టికెట్ ఇచ్చినా సరే*

 

*రాహుల్ గాంధీనీ పిలిచి షాద్ నగర్ నడి చౌరస్తాలో ఇజ్జత్ తీశారు*

 

*షాద్ నగర్ సీనియర్ నేత “నాగర్ కుంట నవీన్ రెడ్డి” సంచలన వ్యాఖ్యలు*

 

*నవీన్ రెడ్డి అత్యవసర మీడియా సమావేశం*

 

ప్రజా గొంతుక :షాద్ నగర్

ప్రతినిధి

 

కాంగ్రెస్ పార్టీలో సిన్సియర్ గా పనిచేస్తున్న నాయకులను, కార్యకర్తలను కాదని అనేక పార్టీలు మారిన వ్యక్తికి నేడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం దౌర్భాగ్యం అని వెంటనే షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ను మార్చకపోతే 48 గంటల్లో నా సత్తా ఏంటో చూపిస్తానంటూ మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, షాద్ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగర్ కుంట నవీన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అల్టిమేట్ జారీ చేశారు.

శుక్రవారం రాత్రి ఆయన అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అభ్యర్థిత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అభిమానిగా తాను ఎంతో బాధపడుతున్నానని అన్నారు. తన కుటుంబం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విధాలుగా సేవలు అందించిందని ఈ సందర్భంగా వివరించారు. తన కుటుంబంలో వార్డు మెంబర్ స్థాయి నుండి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ జెడ్పిటిసి చివరకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దాకా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అధిష్టించామని, కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు అందించామని వివరించారు. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ పి. శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందడం వెనుక తమ కుటుంబ సేవలు ఉన్నాయని గుర్తు చేశారు. పిసిసి స్థాయి నుండి సామాన్య కార్యకర్త వరకు తమ కుటుంబం నుండి సేవలు అందించినట్లు చెప్పారు. 2014లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు మద్దతు తెలిపిన వీర్లపల్లి శంకర్, 2018లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారని పేర్కొన్నారు. అంతకుముందు ఎంపీటీసీగా పోటీ చేసి గతంలో ఓడిపోయారని, ఎంపీటీసీగా ఓడిపోయిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుస్తాడా? అంటూ ఎద్దేవా చేశారు. ఏలాంటి రాజకీయ చరిత్ర లేని వ్యక్తి తన వెంట తిప్పుకున్న నాయకులను మోసం చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం తమ దౌర్భాగ్యం అని అన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఎంతో బాధపడుతున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తాము ఏం వ్యాపారం చేసామో ఏలా చేసామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము.. వీర్లపల్లి శంకర్ ఏ వ్యాపారం చేసి కోట్లు గడించాడో నియోజకవర్గ ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉండాలనీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీని ఎన్నికల ప్రచారం కోసం పిలిచి స్థానిక చౌరస్తాలో ఓ నాలుగైదు వేల మందినీ సమీకరణ చేయడం బాధగా ఉందని, అంత గొప్ప నాయకుడు నియోజకవర్గానికి వస్తే తమ లాంటి నాయకులు ఉన్నట్టయితే కనీసం 15 నుండి 20,000 మంది దాకా సమీకరణ చేసే వాళ్ళమని అన్నారు. రాహుల్ గాంధీ ఇజ్జత్ తీశారని అన్నారు. మామిడిపల్లి, వీర్లపల్లి సొంత గ్రామాల్లో కూడా తన అనుచరులను గెలిపించుకోలేని పరిస్థితి వీర్లపల్లి శంకర్ దని అన్నారు. ఆయన నిలబెట్టిన ఎంపిటిసి కూడా ఓడిపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రేపు 10 గంటల వరకు కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ను మార్చితే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని స్పష్టం చేశారు. లేకపోతే 48 గంటల్లో తానేమిటో నిరూపిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీరుపై కూడా నవీన్ రెడ్డి విడుచుకుపడ్డారు. కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓడిపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోటీ చేయకుండా మల్కాజిగిరి పారిపోయాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ అమ్ముకున్నారని పేర్కొన్నారు. ఎవరి చరిత్రలు ఏమిటో తనకు మొత్తం తెలుసని అన్నారు. 48 గంటలు ఏం జరగబోతుందో చూడాలని సవాల్ విసిరారు. ఇదంతా తాను ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా చేస్తున్నానని చెప్పడం కోసమెరుపు.

Leave A Reply

Your email address will not be published.