*తాగునీటి కోసం రాస్తారోకో..*
*సర్పంచ్ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం*
*మూడు గంటలుగా వెలిజర్ల లో రోడ్డుపై నిరసనలు*
ప్రజా గొంతుక:షాద్ నగర్
తమకు తాగునీటి సరఫరా విషయంలో సర్పంచ్ నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామ ప్రజలు రోడ్డుకు అడ్డంగా ముల్లకంచలు వేసి రాస్తారోకో నిర్వహిస్తున్నారు.
గ్రామ సర్పంచ్ తనకు అనుకూలంగా లేని కాలనీలకు మంచినీటి సరఫరా ఇవ్వకుండా, అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోమని బెదిరింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు అగ్ర వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మూడు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించి నిరసన తెలుపుతున్న సర్పంచ్ మాత్రం స్పందించడం లేదని వాపోతున్నారు.